Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: చైనా సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముగ్గురు వ్యోమగాములను నింగిలోకి పంపనున్నది. మంగళవారం షెంజౌ-15 రాకెట్‌ను ప్రయోగించనున్నది. వ్యోమగాములను ఫీ జున్‌లాంగ్, డెంగ్ క్వింగ్‌మింగ్, జాంగ్ లూ నింగిలోకి పంపనున్నట్లు చైనా అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది. ఇప్పటికే పలు దశల్లో చైనా మాడ్యూల్‌ను రోదసిలోకి పంపిన విషయం తెలిసిందే. చివరగా ‘మెంగ్‌షాన్’ మాడ్యూల్‌ను కక్షలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అమెరికాతో పెరుగుతున్న పోటీ మధ్య అంతరిక్షంలోనూ తన సత్తాను చాటుకునేందుకు గత దశాబ్దకాలంగా చైనా ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా న్యూ తియాంగాంగ్ పేరుతో స్పేస్ స్టేషన్ నిర్మాణాన్ని శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఈ స్పేస్ స్టేషన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండగా.. ఈ ఏడాది చివరికల్లా స్పేస్ స్టేషన్‌ను పూర్తిచేయడమే లక్ష్యంగా పని చేస్తున్నది.