Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: తండయార్‌పేటలో పెండ్లయిన 13వ రోజే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చెన్నై తండయార్‌పేటకు చెందిన ప్రకాష్, గౌరి దంపతుల కుమార్తె రేఖ(35) రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో లేబొరేటరీ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఈమెకు టి.నగర్ గిరియప్ప రోడ్డుకు చెందిన రాజశేఖర్ (40)కు వడపళని మురుగన్ ఆలయంలో ఈ నెల 14వ తేదీ వివాహం జరిగింది.
ఈ నెల 19వ తేదీ రేఖ తండయార్‌పేటలోని పుట్టింటికి వచ్చింది. ఆదివారం బెడ్ రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న ఆర్‌కే నగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. పెళ్లయి 13 రోజులే కావడంతో తండయార్‌పేట ఆర్‌డీఓ విచారణకు ఆదేశించారు. ఆర్‌కే నగర్ ఇన్‌స్పెక్టర్ రవి దర్యాప్తు చేస్తున్నారు.