Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురిని సిట్ విచారించింది. అయితే, ఎవరూ ఊహించని విధంగా తెరపైకి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు వచ్చింది. మూడు రోజుల క్రితం ఆయనకు సీఆర్పీసీ 41ఏ కింద సిట్ నోటీసులు జారీ చేసింది. ఈరోజు 10.30 గంటలకు హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. విచారణకు హాజరుకాకుంటే అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. ఈరోజు విచారణకు రఘురాజు హాజరుకావాల్సిన తరుణంలో సిట్ తాజాగా మెయిల్ పంపింది. ఈరోజు విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదని... మళ్లీ అవసరమైతే పిలుస్తామని మెయిల్ లో పేర్కొంది. దీంతో, సిట్ విచారణకు రఘురాజు హాజరుకావడం లేదు. ఈ కేసులోని నిందితులతో రఘురాజు కలిసి ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసింది.