Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాద ముఠాలపై మంగళవారం ఎన్ఐఏ అధికారులు దాడులు జరిపారు. గ్యాంగ్‌స్టర్-టెర్రర్ కేసులో దర్యాప్తులో భాగంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లోని 20 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దాడులు జరిపింది. దేశవ్యతిరేక కార్యకలాపాలకు గ్యాంగ్‌స్టర్లను ఏవిధంగా ఉపయోగించుకుంటున్నారనే దానిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరా తీస్తోంది. లారెన్స్ బిష్ణోయ్, నీరజ్ బవానా, టిల్లు తాజ్‌పురియాతో సహా ఆరుగురు గ్యాంగ్‌స్టర్‌లను విచారించిన తర్వాత ఉగ్రవాద నిరోధక సంస్థ ఈ దాడులు ప్రారంభించింది.గ్యాంగ్‌స్టర్లను కట్టడి చేసేందుకు ఉత్తర భారతదేశంలోని 50కి పైగా ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు చేస్తోంది. లారెన్స్ బిష్ణోయ్, బవానా గ్యాంగ్ పేరిట భారత్‌లో ఉగ్రదాడులకు భారీగా నిధులు సమకూరుస్తున్నాయని చెప్పారు.