Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నగర శివారు హయత్‌నగర్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలికపై తోటి విద్యార్థులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆగస్ట్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు అత్యాచారాన్ని వీడియో తీసి తోటి విద్యార్థులకు పంపించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బాలికను బెదిరించారు. అనంతరం 10 రోజుల తర్వాత మరోసారి లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.