Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా పాతబడిపోయిన 720 బస్సులను స్క్రాప్ గా మార్చేయనున్నట్లు, వాటి స్థానంలో 1020 కొత్త బస్సులను తిప్పనున్నట్లు వెల్లడించింది. కొత్త వాటిలో సిటీ బస్సులతో పాటు సూపర్ లగ్జరీ, ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉంటాయని అధికారులు వివరించారు. బస్సుల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
అంతే కాకుండా దూరప్రాంతాల నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సాగించే పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ విద్యార్థుల పాస్ లను అనుమతించనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపిన విషయం తెలిసిందే.