Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జోగులాంబ గద్వాల: మొబైల్ చార్జింగ్ పెట్టి తీస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో ఓ బాలిక మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా, ఈడిగోనిపల్లి గ్రామంలో జరిగింది. బసవరాజు, జయంతిల కుమార్తె పదేళ్ల నిహారిక నాల్గవ తరగతి చదువుతోంది. ఇంట్లో మొబైల్ ఫోన్ చార్జింగ్ తీస్తూ కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్లు సరిగా పనిచేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజులుగా ఫ్యాన్లు, టీవీలు కాలిపోతున్నాయని చెబుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక మృతికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు.