Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నవీపేట్
కూతురి పెళ్లి పత్రిక ఖరారు చేసుకుని తిరుగు ప్రయాణంలో తండ్రి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందగా తల్లి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన సంఘటన మండలంలోని గాంధీనగర్ సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ధర్మాబాద్ మండలం యాతాళం గ్రామానికి చెందిన పండరి, గంగామణిల కూతురు నవనీతను జన్నెపల్లి గ్రామానికి చెందిన సాయి కృష్ణతో పెళ్లి సంబంధం కుదరగా పెళ్లి తేదీ ఖరారు చేసుకునేందుకు వచ్చి మోటార్ బైక్ పై తిరుగు ప్రయాణంలో గాంధీనగర్ సమీపంలో వరి ధాన్యం కుప్పను ఢీకొనగా పండరి(46) అక్కడికక్కడే మృతి చెందగా గంగామణికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి ఏఎస్ఐ మోహన్ రెడ్డి వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.