Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. భారీ అంచనాల మధ్య గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. ముఖ్యంగా హిందీలో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. పోటీగా ’83’, ‘స్పైడర్‌మ్యాన్ నో వే హోమ్’ వంటి సినిమాలు ఉన్నా..పుష్ప ధాటికి వాటి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. సుకుమార్ టేకింగ్, విజన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక బన్నీ తన యాక్టింగ్, మేనరిజంలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి గతేడాది ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం రష్యా ప్రేక్షకులను అలరించాడనికి సిద్ధమైంది. రష్యాలో డిసెంబర్ 28న పుష్ప పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్‌కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా తాజాగా చిత్రబృందం రష్యన్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ట్రైలర్‌ను గమనిస్తే డబ్బింగ్ పర్‌ఫెక్ట్‌గా కుదిరినట్లు అనిపిస్తుంది. అయితే పాత ట్రైలర్‌కు ఎలాంటి మార్పులు చేయకుండా రష్యన్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.