Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ భారత్ లో ఇప్పటికే ఎడ్ టెక్, ఫుడ్ డెలివరీ వ్యాపారాలను మూసివేస్తున్నట్టు అమెజాన్ ప్రకటించిన దుషయం తెలిసిందే. తాజాగా హోల్ సేల్ ఈ కామర్స్, డిస్ట్రిబ్యూటషన్ వ్యాపారాలను సైతం నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. అమెజాన్ ప్రస్తుతం బెంగళూరు, మైసూరు, హుబ్లి ప్రాంతాల్లోనే ఈ సేవలు అందిస్తోంది. వేగంగా వినియోగమయ్యే ఉత్పత్తులను కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేసి, వాటిని స్థానిక కిరాణా షాపులు, ఫార్మసీలు, డిపార్ట్ మెంటల్ స్టోర్లకు అమెజాన్ సరఫరా చేస్తుంటుంది. దీనికితోడు భారత మార్కెట్లో అమెజాన్ ఇప్పటి వరకు రూపాయి లాభం కళ్ల చూడలేదు. పైగా ఏటేటా భారీ నష్టాలు పోగేసుకుంటోంది. ఈ క్రమంలో వ్యాపార పునర్ వ్యవస్థీకరణలో భాగంగా నష్టాలు, వ్యయాలను పరిమితం చేసుకునేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటోందని తెలుస్తుంది.