Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తొలి ట్రాన్స్‌జెండర్స్‌గా డాక్టర్లు అయిన ప్రాచీ రాథోడ్, రూత్ జాన్‌పాల్ కొయ్యాల చరిత్రపుటలకెక్కారు. వీరు ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్స్‌గా నియమితులయ్యారు. ఇది ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చారిత్రాత్మక విజయాన్ని సూచిస్తుంది. అయితే వీళ్లు ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా చిక్కుల్ని దాటుకొని వచ్చారు. నేను 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. అప్పటినుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా హైదరాబాద్‌లోని 15 ఆస్పత్రులు నన్ను తిరస్కరించాయి. నా ఐడెంటిటీ వల్లే తిరస్కరిస్తున్నట్టు వాళ్లు నాకు చెప్పలేదు కానీ, నేను ఆ విషయాన్ని స్పష్టంగా గమనించాను, నా ఐడెంటిటీ బయటపడ్డాక, ఆస్పత్రులకు నా విద్యార్హత పట్టించుకోలేదని రూత్ జాన్‌పాల్ ఆన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఇది తన కమ్యూనిటీకి కూడా గొప్ప రోజు అని తెలిపింది.
అంతే కాకుండా ప్రాచీ రాథోడ్ ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఒక ప్రైవేట్ సెక్టార్‌లో పని చేశానని, అయితే తన ఐడెంటిటీ తెలిశాక తనని ఉద్యోగంలో నుంచి తీసేశారని అన్నారు. తాను ట్రాన్స్‌జెండర్ అనే విషయం తెలిస్తే, ఆస్పత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య తగ్గిపోతుందని, ఆ ఆస్పత్రి యాజమాన్యం తనతో చెప్పిందని ఆమె తెలిపారు. గత రెండేళ్లలో తాము ఎన్నో సమస్యల్ని ఎదుర్కున్నామని వ్యక్తిగత సమస్యలతో పాటు సామాజిక వివక్షతో పోరాడాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందినందుకు తాము చాలా గర్వపడుతున్నామని అంటున్నారు.