Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పాదయాత్రలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట వద్ద టీఆర్ఎస్ కార్యకర్తల నుంచి షర్మిలకు తీవ్ర ప్రతిఘటన ఎదురైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈ దాడిలో షర్మిల కారు పాక్షికంగా ధ్వంసమైంది. తాజాగా మంగళవారం టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన తన కారులోనే ప్రగతి భవన్ కు వెళ్లేందుకు షర్మిల బయలుదేరారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు పంజాగుట్ట వద్ద షర్మిలను నిలిపివేశారు. అయితే పోలీసుల వినతిని తిరస్కరించిన షర్మిల కారులో నుంచి దిగేందుకు నిరాకరించడంతో షర్మిల కారును పోలీసులు క్రేన్ సహాయంతో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా షర్మిలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోలీసులు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారన్న ఆరోపణల కింద ఐపీసీ 353, 333, 337 సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేశారు.