Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్: పాక్ కొత్త ఆర్మీ చీఫ్‌గా మునీర్ పేరును ఈనెల 24న ప్రధానమంత్రి షెహబాజ్ షరీప్ నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో వరుసగా రెండు సార్లు ఆర్మీ చీఫ్‌గా కొనసాగిన జావెద్ బజ్వా నేటితో రిటైర్ కావడంతో ఆయన స్థానంలో పాకిస్థాన్ కొత్త ఆర్మీ చీఫ్ గా జనరల్ అసీమ్ మునీర్ మంగళవారంనాడు బాధ్యతలు తీసుకున్నారు. జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో వేడుకగా జరిగిన కార్యక్రమంలో పాక్ 17వ ఆర్మీ చీఫ్‌గా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. పాకిస్థాన్‌లో ప్రధాని, అధ్యక్షుడి కంటే ఆర్మీ చీఫ్ పదవే అత్యంత కీలకం. స్థానిక, విదేశీ కార్యకలాపాల్లో ఆర్మీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. నిజానికి లెప్ట్‌నెంట్ జనరల్‌గా ఉన్న మునీర్ నాలుగేళ్ల పదవీకాలం నవంబర్ 27తో ముగియాల్సి ఉంది. అయితే ఆయన రిటైర్మెంట్‌కు ముందే ఆర్మీ చీఫ్‌గా ఆయన పేరు ప్రకటించడంతో మరో మూడేళ్ల పాటు ఆయన పదవీకాలం పొడిగించినట్లు తెలుస్తుంది. మునీర్ ఇంతకుముందు ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్‌లో పనిచేశారు. 2017 ప్రారంభంలో మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమితులయ్యారు. 2018 అక్టోబర్‌లో ఐఎస్ఐ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.