Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్రంలో రివర్స్ పాలన జరుగుతోందని విమర్శిస్తున్న టీడీపీ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి? పేరిట భారీ కార్యక్రమం తలపెట్టింది. ఈ తరుణంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడం, ప్రజలతో చర్చించడం, ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలతో ఈ కార్యక్రమం సాగనుంది. గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు అంతా దీనిలో భాగస్వాములు అవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు మూడు జిల్లాలలో రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. రేపటి నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో చంద్రబాబు పర్యటిస్తారు. డిశంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల ఇంచార్జ్ లు, నాయకులు ఈ కార్యక్రమాన్ని తమ నియోజకవర్గాల్లో మొదలు పెడతారు.