Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వాతావరణ మార్పుల వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచ ధ్రువాలలోని మంచు కరిగిపోతూ వస్తోంది. దీని వల్ల వేల సంవత్సరాల నుంచి మంచులో చిక్కుకున్న వివిధ రకాల సూక్ష్మజీవులు, వైరస్ లు ఇప్పుడు విడుదలవడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ క్రమంలోనే జాంబీ వైరస్ బయటకి వచ్చింది. ఇది దాదాపు 48వేల 500 ఏళ్ల కిందటిదని అంచనా వేస్తున్నారని సైన్స్ అలర్ట్ ప్రకటించింది. మంచు నుంచి బయటకు వచ్చిన ఈ వైరస్‌లు ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతాయని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ చీఫ్ సైంటిస్ట్ జీన్-మేరీ అలెంపిక్ అన్నారు. అంటువ్యాధులకు కారణమయ్యే ఈ వైరస్ వాతావరణంలోకి అవి విడుదలైతే కలిగే ప్రమాదాలను అంచనా వేయడానికి మరింత అధ్యయనం చేయవలసి ఉందన్నారు. వాతావరణ వేడెక్కడం కారణంగా మిలియన్ల సంవత్సరాలుగా ఘన రూపంలో ఉన్న మంచు, దాని నుంచి సేంద్రీయ పదార్థాలు విడుదల అవుతున్నాయని, వీటిలో ఎక్కువ భాగం కార్బన్ డయాక్సైడ్, మీథేన్‌లేనని, ఇవి గ్రీన్‌హౌస్ ప్రభావాన్ని మరింత పెంచుతాయని మేరీ అలెంపిక్ స్పష్టం చేశారు.