Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత్-న్యూజిలాండ్ మధ్య క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ కు దిగింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత హమిల్టన్‌లో జరిగిన రెండో వన్డేకు వరుణుడు అడ్డుపడడంతో మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు జట్లకు నేటి మ్యాచ్ కీలకంగా మారింది. భారత జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. న్యూజిలాండ్ మాత్రం ఒకే ఒక్క మార్పుతో ఆడుతోంది. బ్రాస్‌వెల్ స్థానంలో మిల్నే జట్టులోకి వచ్చాడు.