Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ నగరంలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వారి ఎలక్ట్రానిక్స్ కమ్ ఫర్నీచర్ దుకాణంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు పిల్లలతో సహా ఒక కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి ఫిరోజాబాద్ జిల్లా జస్రానా ప్రాంతంలోని పాదం పట్టణంలో చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగడంతో మొదటి అంతస్తులోని దుకాణం, యజమానుల ఇల్లు దగ్ధమైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆగ్రా, మెయిన్‌పురి, ఇటా, ఫిరోజాబాద్‌ల నుంచి 18 అగ్నిమాపక దళ వాహనాలు, 12 పోలీసు స్టేషన్‌ల నుంచి సిబ్బంది రెండున్నర గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ప్రాణనష్టంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల సాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది.