Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగుల జడ్పీ ఉన్నత పాఠశాలలో సుమారు 200మంది విద్యార్థులు ఉన్న బడిలో ఇద్దరు ఉపాధ్యాయులే ఉన్నారు. బోధించేవారు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్దులు వెంటనే టీచర్లను నియమించాలి అంటూ రెండు రోజుల కిందట రోడ్డెక్కారు. ఆ మర్నాడే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామారావును సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులు జ్వారీ చేసింది. దీంతో అక్కడి విద్యార్థులకు ఒక టీచర్ మాత్రమే మిగిలారు. ఉపాధ్యాయులను భర్తీ చేయాలని కోరితే ఉన్న ఇద్దరిలో ఒకరిని సస్పెండ్ చేశారని ఉద్యోగ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.