Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో టీమ్‌ఇండియా బ్యాటింగ్ చేస్తున్నది. ఈ తరుణంలో తక్కువ పరుగుల తేడాతో ఓపెనర్లను టీమ్‌ఇండియా కోల్పోయింది. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో శుభ్‌మన్ గిల్ (13) ఔటవగా, 13వ ఓవర్లో కెప్టెన్ ధావన్ (28) పెవిలియన్ చేరాడు. మంచి ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరు ఓపెనర్లను కివీస్ బౌలర్ ఆడమ్ ఔట్‌చేశారు. ఇక ఫోర్త్ ప్లేస్‌లో వచ్చిన కీపర్ రిషబ్ పంత్ మరోసారి నిరాశ పరిచాడు. 16 బాల్స్ ఆడిన పంత్ 10 రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ 42 (50), సూర్య 6 (9) బ్యాటింగ్ చేస్తున్నారు. 24 ఓవర్లు ముగిసే సరికి టీమ్‌ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 110 రన్స్ చేసింది.