Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో నాటు తుపాకులు లభించాయి. గంజాయి సాగుచేస్తున్నారనే సమాచారంతో ఆబ్కారి అధికారులు నిజాంసాగర్ మండలం సంగీతంలో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇంట్లో సోదాలు చేయగా గంజాయి మొక్కలతోపాటు రెండు నాటు తుపాకులు లభించాయి. దీంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని ఎక్సైజ్ అధికారులు బాన్సువాడ పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడి ప్రకారం నాటు తుపాకులను జంతువుల వేటకు వాడుతున్నట్లు తెలుస్తుంది.