Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్రలో డీఈడీ కాలేజీలు మూతపడుతున్నాయి. డీఎడ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫలితాలు వచ్చిన మూడున్నర నెలల తర్వాత అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. అయితే, ఇప్పటికే కౌన్సెలింగ్ లేట్ అవడంతో చాలామంది స్టూడెంట్లు వివిధ కోర్సుల్లో చేరిపోయారు. దీంతో తమ కాలేజీలలో సీట్లు నిండుతాయో లేదోనని 40 కాలేజీల మేనేజ్‌మెంట్లు కౌన్సెలింగ్‌లో పాల్గొనబోమని అధికారులకు తేల్చి చెప్పాయి. రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో అడ్మిషన్ల కోసం 4 రోజుల కింద స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. అభ్యర్థులు డిసెంబర్ 1 నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. 10న సీట్ల అలాట్‌మెంట్, 15లోపు కాలేజీల్లో రిపోర్టు చేయాలి. డిసెంబర్ 17 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి.
అయితే, ఆగస్టు ఫస్ట్ వీక్‌లోనే డీసెట్ ఫలితాలు రిలీజ్ కాగా, ఇందులో 6,550 మంది క్వాలిఫై అయ్యారు. ఇప్పటికే అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయింది. దాదాపు మూడున్నర నెలల తర్వాత అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇవ్వడంపై స్టూడెంట్లు మండిపడుతున్నారు. రాష్ట్రంలో 2021-22 విద్యా సంవత్సరంలో 99 డీఈడీ కాలేజీలు ఉండగా, వాటిలో 6,888 సీట్లు ఉండేవి. వీటిలో 10 సర్కార్ కాలేజీల్లో 1,400 సీట్లు అందుబాటులో ఉండేవి. 2022-23 విద్యా సంవత్సరంలో కాలేజీల సంఖ్య 59కి తగ్గడంతో, సీట్ల సంఖ్య 4,600కు పరిమితమైంది. ఈ ఒక్క ఏడాదిలోనే 40 కాలేజీలు కౌన్సెలింగ్ నుంచి తప్పుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన డీఈడీ కాలేజీలు ఇప్పుడు ఏటా తగ్గుతున్నాయి.