Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాజస్థాన్ నుంచి నగరానికి మత్తు మందు ఎగుమతిచేస్తున్న నలుగురిని మల్కాజిగిరి ఎస్‌వోటీ, నేరేడ్‌మెట్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి 750 గ్రాముల ఓపిఎం, 500 గ్రాముల పాపిస్టా స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.12.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. వారు హైదరాబాద్‌లో వ్యాపారస్తులకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని, వారు ప్రయాణిస్తున్న కారును సీజ్ చేశామన్నారు. ఇక బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న నలుగురిని ఎల్బీనగర్ ఎస్‌వోటీ, సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 12 గ్రాముల హెరాయిన్, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.