Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం అరెస్టు చేసింది. అమిత్ అరోరా బడ్డీ రిటైల్ డైరెక్టర్. వ్యాపారులు అమిత్ అరోరా, దినేష్ అరోరా, అర్జున్ పాండేలు సిసోడియాకు సన్నిహిత సహచరులని ఈడీ తెలిపింది. వీరు మద్యం లైసెన్సుదారుల నుంచి సేకరించిన డబ్బును ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లించడంలో చురుకుగా పాల్గొన్నారని ఈడీ తెలిపింది. మద్యం కేసులో ఇప్పటి వరకు మొత్తం ఐదుగురిని ఈడీ అరెస్ట్ చేయగా తాజాగా సెప్టెంబర్ 27వతేదీన మద్యం వ్యాపారి సమీర్ మహంద్రును ప్రశ్నించిన అనంతరం ఈడీ అరెస్ట్ చేసింది.