Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చలి వణికిస్తోంది. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్నటి నుంచి పగటి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత పెరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 8.5 డిగ్రీలు నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో 8.8 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 9.7 డిగ్రీలు, నిర్మల్‌లో 10.3 డిగ్రీలు, మంచిర్యాలలో 10.5 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా హబ్సీపూర్‌లో 10 డిగ్రీలు, మెదక్ జిల్లా టేక్మాల్‌లో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పల్లెలు, పట్టణాల్లో ఉదయం పూట పొగమంచు కమ్ముకుంటుంది.