Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కన్యాకుమారిలోని ఓ ప్లైవుడ్ కంపెనీ యజమాని కోతి చేసిన పనికి షాక్ తిన్నారు. ప్లైవుడ్ షాపు పరిసరాల్లో ఏం జరుగుతుందో గుర్తించేందుకు యజమాని తన షాపులో సీసీటీవీ కెమెరాలను అమర్చాడు. చోరీలను పసిగట్టేందుకు తాను ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ఒకదాని తర్వాత ఒక కెమెరా చోరీకి గురి అవుతుండటంతో యజమాని విస్తుపోయాడు. కెమెరాలను చోరీ చేస్తున్న దొంగను పట్టుకునేందుకు యజమాని తీవ్రంగా ప్రయత్నించడంతో తన షాపు నుంచి సీసీటీవీ కెమెరాలను దొంగిలిస్తోంది ఓ కోతి అని తెలిసి ఆశ్చర్యపోయాడు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ విషయం బయటపడింది. యజమాని ఇప్పటివరకూ 13 సీసీటీవీ కెమెరాలను కోల్పోయాడు.