Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హర్యానాలోని రోహతక్‌లో ఓ యువతి ఫోన్ మాట్లాడుతూ, రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించింది. అడుగు దూరంలోనే ప్లాట్‌ఫామ్ ఉంది. అయితే ఇంతలోనే ఒక గూడ్స్ రైలు దూసుకొచ్చింది. ఆ యువతి తన ప్రాణాలను లెక్క చేయకుండా ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంది. అటు ప్లాట్‌ఫామ్‌పై ఎక్కడానికి తగిన సమయం కూడా లేకపోవడంతో, రైలు పట్టాలపైనే పడుకుంది. రైలు వెళ్లిపోయిన తర్వాత కూడా తాపీగా పైకి లేస్తూ, ఫోన్ మాట్లాడుతూనే ఉంది. ఈ వీడియోని ఓ ఐపీఎస్ అధికారి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ ప్రాణాల కన్నా, ఫోన్‌లో గాసిప్ చేయడమే ముఖ్యమైపోయిందా? అంటూ పోస్ట్ పెట్టాడు. ఇక నెటిజన్లైతే ఆమెను ఏకిపారేస్తున్నారు. అటు, రైల్వే అధికారులు ఈ వీడియోని షేర్ చేసి, పట్టాలు దాటుతున్న సమయంలో జాగ్రత్తగా ఉండండని సూచించారు. అయితే ఈ ఘటన ఏప్రిల్‌లో జరగగా ఈమధ్య ఈ వీడియో ఎక్కువగా వైరల్ అవుతోంది.