Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డే కూడా వర్షం కారణంగా రద్దైంది. మొదటి మ్యాచ్‌లో టీమిండియాపై న్యూజిలాండ్ విజయం సాధించగా.. రెండో వన్డే వర్షం కారణంగా రద్దైంది. తాజాగా మూడో వన్డేలో భారత్ ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం.. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. 220 పరుగలు లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆటగాళ్లు చెలరేగి ఆడారు. 18 ఓవర్లు ముగిసే సరిగి వికెట్ నష్టానికి 104 పరుగులు చేశారు. ఇంతలో వర్షం మొదలవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-0తో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 47.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 28 పరుగులు చేయగా, గిల్ 13, అయ్యర్ 49, పంత్ 10, సూర్యకుమార్ 6, దీపక్ హుడా 12, వాషింగ్టన్ సుందర్ 51, దీపక్ చాహర్ 12, చాహల్ 8, అర్ష్‌దీప్ 9 పరుగులు చేశారు.