Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: చిన్నారులకు సోకే మీజిల్స్ వ్యాధి దేశంలో మరో రాష్ట్రానికి పాకింది. ఇప్పటికే మహారాష్ట్రలో వందల కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కేరళలో కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి కేరళలో వరకు 160 మంది పిల్లలకు వైరస్ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులోనూ మలప్పురమ్ జిల్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. అయితే, ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా సంభవించకపోవటం ఊరట కలిగిస్తోంది. మీజిల్స్ వైరస్ కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
కేరళలో మీజిల్స్ వైరస్ వ్యాప్తిని అంచనా వేసేందుకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం రాష్ట్రానికి చేరుకుంది. మలప్పురమ్‌లో పర్యటన అనంతరం ఆరోగ్య శాఖ కార్యదర్సితో నిపుణులు భేటీ కానున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి మీనా జార్జ్ మాట్లాడుతే ఎలాంటి ఆందోళన చెందకుండా తమ పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో వైరస్‌పై పోరాడేందుకు ప్రజాహిత చర్యలు తీసుకుంటున్నమని, వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టా అని ఆరోగ్య శాఖ ఓ ప్రకటన చేసింది. జిల్లాలో అవసరమైన ఎంఆర్ వ్యాక్సిన్, విటమిన్ ఏ సిరప్‌లు అందుబాటులో ఉన్నాయని తెలియజేసింది.