Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్:2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె మూడెళ్ల కుమార్తె సహా కుటుంబంలోని ఏడుగురిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో 11 మందిని దోషులుగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన న్యాయస్థానం వారిని 15 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకున్న తరుణంలో ఈ ఏడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 1992 ఉపశమన నిబంధనలకు ఈ కేసుకు వర్తింపజేస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది మేలో అనుమతివ్వడాన్ని ఆమె వ్యతిరేకించారు. అలాగే 11 మంది దోషులను ముందుగానే విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మరో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను ఒకేసారి, ఒకే ధర్మాసనం విచారించే విషయాన్ని పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలియజేశారు.