Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని క్వెట్టాలో పోలీసు వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బుధవారం నైరుతి పాకిస్తాన్ నగరమైన క్వెట్టాలో తెహ్రీక్ ఇ-తాలిబన్ పాకిస్తాన్ (టిటిపి) గ్రూప్ పోలీసు వాహనంపై ఆత్మాహుతి దాడికి పాల్పడింది. జూన్‌లో ఎలాంటి కాల్పులు జరపమని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈ గ్రూప్ దాడికి పాల్పడడం గమనార్హం. పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలియో వ్యాక్సినేషన్ ప్రచార కార్యకర్తల్ని రక్షించడానికి ఏర్పరచిన పోలీసు వాహనం లక్ష్యంగా టిటిపి దాడి చేసింది. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి, ఇద్దరు పౌరులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ ఘటనలో 24 మంది గాయపడగా.. వారిలో 20 మంది పోలీసులేనని క్వెట్టా పోలీస్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డిఐజి) గులాం అజ్ఫర్ మహేసర్ వెల్లడించారు. ఈ దాడిలో రెండు వాహనాలు ధ్వసంమయ్యాయని ఆయన తెలిపారు.