Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్రపతి భవన్‌లో బుధవారం అర్జున అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. 25 మంది క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అర్జున అవార్డులను ప్రదానం చేశారు. అలాగే ఏడుగురు కోచ్‌లను ద్రోణాచార్య అవార్డు, నలుగురు ఆటగాళ్లను ధ్యాన్‌చంద్ అవార్డుతో సత్కరించారు. స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్‌లను రాష్ట్రపతి సత్కరించారు. వీరిద్దరూ ఈ ఏడాది థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టులో సభ్యులు. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సారి అర్జున అవార్డులకు ఎంపికైన క్రీడాకారుల్లో ఎక్కువగా కామన్వెల్త్ గ్రేమ్స్-2022లో పాల్గొని భారత్‌కు పతకాలు అందించారు. లక్ష్యసేన్‌తో పాటు మహిళా బాక్సర్ నిఖత్ జరీన్, రెజ్లర్ అన్షు మాలిక్‌తో పాటు భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజానందను అర్జున అవార్డుతో రాష్ట్రపతి సత్కరించారు.