Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆస్పత్రిగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆస్పత్రిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్యా విధాన పరిషత్ బుధవారం జీవో జారీ చేసింది. ఏరియా ఆస్పత్రి నిర్మాణానికి రూ. 45.79 కోట్ల నిధులు కేటాయించారు. దీంతో పాటు ఆలేరు నియోజకవర్గం వ్యాప్తంగా 13 ప్రాథమిక ఉప కేంద్రాలను మంజూరు చేసింది ప్రభుత్వం. ఒక్కో ఆస్పత్రి నిర్మాణానికి రూ. 20 లక్షలు కేటాయించారు.