Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోడుమూరు: కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయిన కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవ్వగా.. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు నంద్యాల జిల్లా అలగనూరుకు చెందిన యలమరాజు, ఆయన కుమారుడు నారాయణ, కర్నూలు జిల్లా తుగర్చేడుకు చెందిన వెంకటస్వామిగా గుర్తించారు. కారు డ్రైవర్ రఘునాయక్‌కు తీవ్ర గాయాలు కావటంతో కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహన దారుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.