Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ బుధవారం రెండో విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. యూనివర్సిటీ ప్రకటించిన తుది మెరిట్ జాబితాలో అర్హత సాధించిన అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీ రాత్రి 7గంటల లోపు కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్‌లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఖాళీ సీట్ల వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపర్చామని, మరిన్ని వివరాల కోసం https://www.knruhs.telangana.gov.in/ అనే వెబ్‌సైట్ చూడాలని కోరారు.