Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కథువా జిల్లాలో బుధవారం రాత్రి ఓ కారు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోవడంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మరణించారని కథువా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కుటుంబంలోని మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. రోడ్డుపై నుంచి కారు మంగియార్ ప్రాంతంలోని 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది.క్షతగాత్రులను స్థానికుల సహాయంతో బని అధికారులు రక్షించినట్లు పోలీసులు తెలిపారు.క్షతగాత్రులను కథువాలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.