Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్: నేడు గుజరాత్ లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 19 జిల్లాల్లోని 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుండగా, 788 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఇందుకోసం 14,382 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. 2,39,76,670 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్టు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి తెలిపారు.
తొలి విడత పోలింగ్‌కు వెళ్తున్న 89 సీట్లలో బీజేపీ 2017లో 48 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 40 సీట్లు దక్కించుకుంది. ఒక సీటు స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్, 36 ఇతర పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మొత్తం 89 నియోజకవర్గాల్లోనూ తమ అభ్యర్థులను నిలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ 88 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఆ పార్టీ సూరత్ ఈస్ట్ అభ్యర్థి చివరి నిమిషంలో తన నామినేషన్‌ను ఉపసంహరించువడంతో ఒక స్థానం తగ్గింది. బీఎస్‌పీ నుంచి 57 మంది, బీజేపీ నుంచి 14, సీపీఎం నుంచి నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 339 మందికి పైగా ఇండిపెండెట్లు కూడా పోటీలో ఉన్నారు. కాగా, మొత్తం 788 మంది అభ్యర్థుల్లో 70 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ 9 మంది మహిళలకు, కాంగ్రెస్ ఆరుగురికి, ఆప్ ఐదుగురికి టిక్కెట్లు ఇచ్చింది. కాగా, చివరిది, రెండవది అయిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 5న జరుగనుంది. డిసెంబర్ 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.