Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పాస్‌పోర్టు జారీ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో వచ్చే శనివారం(డిసెంబరు3) పాస్‌పోర్టు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. శనివారం సెలవు రోజు అయినప్పటికీ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు మూడో తేదీన సేవలందించనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్, ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య బుధవారం ఓ ప్రకటన చేశారు. ఈ డ్రైవ్‌లో భాగంగా రాష్ట్రంలోని అన్ని పాస్‌పోర్టు సేవాకేంద్రాలు(పీఎస్‌కే), పోస్టాఫీసు సేవా కేంద్రాలు పనిచేస్తాయని వివరించారు. అమీర్‌పేట్, బేగంపేట్, టోలీచౌకీతో పాటు నిజామాబాద్ పీఎ్‌సకేలలో తత్కాల్ కోటాలో దాదాపు 2వేల స్లాట్లు అందుబాటులో ఉన్నాయని, ఇతర చోట్ల జనరల్ విభాగంలో మరో వెయ్యి స్లాట్లు ఉన్నాయని వివరించారు. ఇప్పటికే స్లాట్‌లు బుక్ చేసుకున్నవారు డిసెంబరు 3వ తేదీకి స్లాట్ మార్చుకునే వీలు కల్పించామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దాసరి బాలయ్య కోరారు.