Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్ సోకడంతో ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నానని బిల్ క్లింటన్ స్వయంగా ప్రకటించారు. ‘నేను కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో పాజిటివ్ అని తేలింది. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. అయితే నేను బాగానే ఉన్నా, ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నాను. వ్యాక్సిన్‌తోపాటు బూస్టర్ డోసు తీసుకోవడంతో తీవ్రత తక్కువగా ఉన్నది. అందువల్ల అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి’ అని క్లింటన్ ట్వీట్ చేశారు.