Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ విషయం నిన్న వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ. బీజేపీపై ఆమె విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చే ఎనిమిదేళ్లు అవుతోందని... ఈ కాలంలో తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజామ్యయుతంగా ఎన్నికైన ఎనిమిది ప్రభుత్వాలను పడగొట్టి, అడ్డదారిలో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారని విమర్శించారు. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు రావడానికి ఒక ఏడాది ముందు ఆ రాష్ట్రానికి మోడీ కంటే ముందు ఈడీ వెళ్తుండటాన్ని మనం గమనిస్తున్నామని కవిత చెప్పారు. మోడీ పాలనలో ప్రభుత్వాలను కూల్చే కుట్రలు జరుగుతాయని అన్నారు. తెలంగాణలో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి... మోడీ కంటే ముందు ఈడీ వచ్చిందని చెప్పారు. తన మీద కానీ, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై కానీ ఈడీ దాడులు జరగడం సహజమేనని... వాటికి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఈడీ, సీబీఐలను ప్రయోగించి అత్యంత చైతన్యవంతమైన తెలంగాణలో అధికారంలోకి రావాలనుకోవడం జరిగే పని కాదని అన్నారు. జైల్లో పెడతామంటే ఇక చేసేదేముందని... పెట్టుకో అని కవిత అన్నారు. భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఈడీ విచారణకు తాము సహకరిస్తామని చెప్పారు. మీడియాకు ముందే లీకులిస్తూ అలజడి రేపాలనుకుంటున్నారని మండిపడ్డారు.