Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూరు పంచాయతీ పరిధిలోని టైరోడ్డు వద్ద మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా యడ్లపూర్ గ్రామానికి చెందిన మల్లికార్జున్ (48) బైక్‌పై వెళ్తూ టైరోడ్డు చెక్‌పోస్టు వద్ద ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టాడు. దాంతో అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.