Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ గురువారం కొనసాగుతోంది. స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. తొలి గంటల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా.. పోలింగ్ ప్రారంభానికి ముందు ఓ బీజేపీ అభ్యర్థిపై దాడి జరగడం స్థానికంగా కాస్త కలకలం రేపింది. వాంసద నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న పీయూష్ పటేల్‌పై గురువారం తెల్లవారుజామున కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఝారీ గ్రామంలో పీయూష్ కారులో వెళ్తుండగా దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో పీయూష్ తలకు గాయమైంది. వాంసద కాంగ్రెస్ అభ్యర్థి అనంత్ పటేల్ అనుచరులే ఈ దాడికి పాల్పడినట్లు బీజేపీ ఆరోపిస్తోంది.