Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భోపాల్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. 83వ రోజు పాదయాత్రలో గురువారం బాలీవుడ్ నటి స్వర భాస్కర్, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్‌లు రాహుల్‌తో కలిసినడచారు. రాహుల్ యాత్ర ప్రస్తుతం ఉజ్జయిని మీదుగా సాగుతోంది. మోడీ సర్కార్ విధానాలను ఎండగడుతూ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ఇప్పటివరకూ 7 రాష్ట్రాల్లోని 36 జిల్లాల మీదుగా 1209 కిలోమీటర్లు సాగింది.
దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చే లక్ష్యంతో రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర కశ్మీర్‌లో ముగుస్తుంది. భారత్ జోడో యాత్రలో ఇప్పటికే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా సహా పలువురు పార్టీ అగ్రనేతలు, సీనియర్ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు.