Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గుళ్లు, ఫొటో స్టూడియోలే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను ఉప్పల్ పోలీసులు, మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు కలిసి పట్టుకొని బుధవారం రిమాండ్‌కు తరలించారు. బుధవారం మల్కాజిగిరి ఏసీపీ నరే్‌షరెడ్డి, ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ గోవింద్‌రెడ్డి, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. ఒడిస్సా రాష్ట్రం గంజామ్ జిల్లాకు చెందిన అమిత్ కుమార్ స్వైన్(20) రామంతాపూర్ సాయిచిత్రనగర్‌లో ఉంటున్నాడు. తాళం వేసి ఉన్న ఫొటోస్టూడియోలను, గుళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు విశ్వనీయ సమాచారం అందింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా రామంతాపూర్ ఎండోమెంట్ కాలనీలోని మానస ఫొటో స్టూడియోలో అక్టోబర్ 24న తాళం వెసి ఉండగా రాత్రి తాళం పగుల గొట్టి అందులోని విలువైన కెమెరాలను, ఇతర సామగ్రిని దొంగిలించినట్లు నిందితుడు అంగీకరించారు. నిందితుడి నుంచి 3.5 లక్షల విలువైన కెమెరాలు, లెన్సులు, ఫ్లాష్ లైట్లు, చార్జర్జు స్వాధీనం చేసుకున్నారు.