Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,897 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. వివిధ కేటగిరీల్లో తొమ్మిది వైద్య కళాశాలలు, అనుబంధ హాస్పిటళ్లకు పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీచేసింది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్‌లోని మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్పిటళ్లకు ఈ పోస్టులను మంజూరు చేసింది. వీటిలో ఒక్కో కాలేజీకి 433 పోస్టులను కేటాయించింది.
వైద్య కళాశాలలకు కొత్తగా పోస్టులు మంజూరు చేయడంపట్ల మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు పడిందని అన్నారు. అందరికీ సరైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.