Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులతో పాటు వాట్సాప్ పాలసీ నిబంధనలను ఉల్లంఘించిన 23 లక్షల భారత ఖాతాలను అక్టోబర్‌లో వాట్సాప్ తొలగించింది. ఐటీ యాక్ట్ రూల్ 4(1) (డీ) కింద యూజర్ల భద్రతా మార్గదర్శకాలకు లోబడి ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబక్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్య 23,24.000 వాట్సాప్ ఖాతాలను యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా బ్యాన్ చేశామని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ విడుదల చేసిన యూజర్ల భద్రత మంత్లీ రిపోర్ట్ పేర్కొంది. యూజర్ల పిర్యాదులకు ముందు 8,11,000 భారత్ ఖాతాలను పాలసీ నిబంధనలు ఉల్లంఘించినందుకు వాట్సాప్ నిషేధించింది. వాట్సాప్ గ్రీవెన్స్ వేదికల నుంచి భారత యూజర్ల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై ఈ నిర్ణయం తీసుకున్నామని వాట్సాప్ ఈ నివేదికలో పేర్కొంది.
ఆన్‌లైన్ వేధింపులను నిరోధించేందుకు తాము విస్పష్ట నిబంధనలు, మార్గదర్శకాలు అమలు చేస్తున్నామని, తమ యూజర్ల భద్రత, గోప్యతను కాపాడేందుకు ఎండ్‌టుఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మేసేజింగ్ సేవలను అందిస్తున్నామని తెలిపింది. తమ వేదికపై యూజర్ల భద్రత కోసం ఏఐతో పాటు లేటెస్ట్ టెక్నాలజీ, డేటా సైంటిస్ట్‌లు, నిపుణులపై భారీగా వెచ్చిస్తున్నామని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ పేర్కొంది.