Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భార్య సునందా పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2014 జనవరి 17న ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్లో సునంద అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హత్య అనే కోణంలో తొలుత దర్యాప్తు జరగగా ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. jకానీ ఆమె ఆత్మహత్య చేసుకునేలా శశి థరూర్ ప్రేరేపించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. అయితే ఆయన ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించగా ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు 2021 ఆగస్టులో ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేసింది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో పోలీసులు సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు థరూర్ కు నోటీసులు జారీ చేయగా, తదుపరి విచారణను 2023 ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.