Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలో 9 జిల్లా కేంద్రాల్లో వచ్చే ఏడాది ప్రారంభం కానున్న బోధనాస్పుత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన మేరకు పోస్టులను కేటాయిస్తూ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో బోధనాస్పుత్రికి 433 పోస్టుల చొప్పున మొత్తంగా 3,897 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. ఈ పోస్టుల్లో ఆయా బోధనాసు్పత్రులతో పాటు వాటికి అనుబంధంగా ఏర్పాటు కానున్న ఆసుపత్రులకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం అసిఫాబాద్, జనగాం, నిర్మల్ లలో వచ్చే ఏడాది బోధనాసుపత్రులను ప్రారంభించనున్నారు. వీటికి అవసరమైన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు ఇతరత్రా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం ఓ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణను మరింత పరిపుష్టం చేసేలా కొత్త మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని, వాటికి అవసరమైన పోస్టులను భర్తీ చేయనున్నామని తెలిపారు.