Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ధర్మపురి మండలం గోదావరిలో రెండు లక్షల చేప పిల్లలను నీటిలో నీటిలో విడుదల చేశారు. ఈ తరుణంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కులవృత్తులు అంతరించకుండా కాపాడేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలను సబ్సిడీపై అమలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులకు రాయితీపై వాహనాలు, వలలు, తెప్పలు, ఇతర సామాగ్రిని సబ్సిడీ పై అందజేస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో సొసైటీలను ఏర్పాటు చేసి నూతన భవనాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో సొసైటీల్లో ఉన్న మత్స్యకారులకు చేపలు పట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని, ప్రభుత్వం కల్పించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.