Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ బుధవారం జరిగింది. ఈ తరుణంలో కచ్ జిల్లాలోని భుజ్ శాసన సభ నియోజకవర్గంలో నవ దంపతులు కవిత, వైభవ్ పెళ్లి మండపం నుంచి నేరుగా 208వ నెంబరు పోలింగ్ బూత్‌కు వెళ్లి, ఓట్లు వేశారు. వీరిద్దరూ పోలింగ్ బూత్‌లోని సెక్యూరిటీ గార్డులతో కలిసి ఫొటో దిగారు. ఓటు హక్కు పట్ల వీరికిగల చైతన్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ ఉంటుంది. ఆ ఓటు హక్కును వినియోగించుకుని సరైన ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవచ్చనే ఆశభావాన్ని ఈ దంపతులు కలిగిస్తున్నారు.