Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నేడు గుజరాత్ లో పోలింగ్ జరుగుతున్న విషక్ష్మీం తెలిసిందే. ఈ తరుణంలో గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల్లో ఇప్పటివరకూ 48.48% పోలింగ్ నమోదైంది. తాపిలో అత్యధికంంగా 63.98% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ విడతలో దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లో 19 జిల్లాల్లోని 89 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 788 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. తొలి విడతలో ఓటుహక్కు వినియోగించుకునే వారి సంఖ్య 2.39 కోట్లు ఉండొచ్చని ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేశారు. 14,382 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.